హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు విలన్ గా ఏ పాత్రలో నటించినా ఆ పాత్ర కి న్యాయం చేసే నటులలో సీనియర్ నటుడు జగపతిబాబు కూడా ఒకరు

ఈయన హీరోగా ప్రేక్షకులను  బాగా అలరించారు. విలన్ గా మరియు ఒక తండ్రి ఎలా ఉండాలో చెప్పే ఎన్నో తండ్రి పాత్రలలో కూడా నటించి చూపించారు.ఇలా ఏ పాత్రలో నటించిన కానీ ఇట్టే ఆ పాత్రలో ఇమిడిపోయి వంద శాతం ఆ పాత్రకు న్యాయం చేసే జగపతిబాబు ప్రస్తుతం వరుస సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు విలన్ గా నటిస్తూ బాగా బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరియర్ గురించి అలాగే తన సినీ జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక చేదు సంఘటన చెప్పారు.

ఈ క్రమంలోనే జగపతిబాబు మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి 35 సంవత్సరాలు దాటిందని అయితే తనకు సినిమా తప్ప వేరే ఏమీ కూడా తెలియదని జగపతిబాబు వెల్లడించారు.తాను సాహసం సినిమా షూటింగ్ సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డానని కూడా తెలిపారు. ఈ సినిమాలో తాను సెకండ్ హీరోగా నటించానని కూడా జగపతిబాబు గుర్తు చేసుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో వారం రోజులపాటు కనీసం తనకి తిండి కూడా సరిగా పెట్టలేదని, తింటావా అని అడిగే వారు కూడా లేకుండా పోయారని జగపతిబాబు తన బాధ ను తెలియజేశారు. అప్పుడు ఒక లైట్ బాయ్ నా దగ్గరికి వచ్చి నా పరిస్థితి చూసి జాలిగా చూసారని అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఆరోజు జరిగిన ఈ అవమానం తనకు ఎప్పటికి ఒక గుణపాఠంలా మారిందని.అయితే మనం ఇతర భాషలలో కనుక సినిమాలు చేసి వస్తే మనకు ఇక్కడ ప్రత్యేకమైన గౌరవం ను ఇస్తారంటూ ఈ సందర్భంగా ఈయన తనకు ఎదురైనటువంటి చేదు అనుభవం  గురించి తెలియజేశారు. ఇలా జగపతిబాబు చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: