
ఫిబ్రవరి 17వ తేదీన చిత్ర నిర్మాత జేమ్స్ కామెరూన్.. యొక్క వీడియోని పంచుకున్నప్పుడు చిరంజీవి ట్విట్టర్ లోకి వెళ్లారు. అక్కడ తను రాజమౌళి యొక్క rrr ను ప్రశంసించడం మనం ఆ వీడియోలో చూడవచ్చు. వీడియోని వదిలేస్తే మెగాస్టార్ సంతోషకరమైన ఒక వాక్యాన్ని రాయడం జరిగింది.."సార్@ జిమ్ కెమెరాన్ #RRR తన పాత్రను గ్లోబల్ ఐకాన్ , మీలాంటి సినిమాటిక్ మేధావి నుండి అంగీకరించడం ఆస్కార్ కంటే తక్కువ కాదు..@ఆల్వేస్ రామ్ చరణ్ కి ఇది ఒక గొప్ప గౌరవం అంటూ తెలియజేశారు.
ఒక తండ్రిగా ఆయన అంతా దూరం వచ్చినందుకు తనకు చాలా గర్వంగా ఉంది. మీ అభినందనని అతని భవిష్యత్తు ప్రయత్నాలకు ఒక ఆశీర్వాదం వంటిది అంటూ తెలియజేశారు చిరంజీవి.అయితే ఈ ట్వీట్ నందమూరి అభిమానులే కాకుండా కొంతమంది నేటిజన్లకు కూడా ఈ ట్వీట్ నచ్చలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ లేదా రాజమౌళి పేర్లను జోడించకపోవడంతో చిరంజీవి ఉద్దేశపూర్వకంగానే ఈ ట్విట్ చేశారని కొంతమంది నేటిజన్లు భావిస్తున్నారు. రామ్ చరణ్ నటనను కాకుండా రామ్ చరణ్ క్యారెక్టర్ రైస్ ని జేమ్స్ కెమెరాన్ మెచ్చుకోవడంతో..చిరంజీవి రాజమౌళి పేరును ఎలా మిస్ అవుతున్నారని నేటిజన్లు చిరంజీవి పైన ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో అయితే చిరంజీవి ట్రోల్ అవుతున్నారు.