కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వైసిపి అధికారం పోయి 18 నెలలు కావస్తోంది. ఇందులో మాజీ సీఎం జగన్ ఇష్యు బేస్డ్ గా కొన్ని జిల్లాలలో మాత్రమే పర్యటన చేశారు. జగన్ చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఏదో ఒక విధంగా రచ్చకు దారితీసింది. కొన్ని నెలల పాటు రప్పా.. రప్పా అంటూ సాగిన ఆ తర్వాత మామిడి, మిర్చి రైతుల పరామర్శాలు, తోపులాట, కేసుల వల్ల ఇష్యూ డైవర్ట్ అయింది. గత కొన్ని నెలలుగా మాత్రం మెడికల్ కాలేజీల అంశంపై వైసీపీ దూకుడు గా ముందుకు వెళ్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.


వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ (PPP) ప్రైవేట్ వాళ్లకి ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టే అంశం పైన వైసిపి చేపట్టిన ఉద్యమం పతాక స్థాయికి చేరింది. దీంతో కోటి సంతకాల సేకరణ ఆ తర్వాత గవర్నర్ కి, ఆ కోటి సంతకాలను అందించడం ఇలాంటివి జరిగింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ "సేవ్ మెడికల్ కాలేజస్ ఇన్ ఏపీ" అన్నటువంటి అంశం మీద ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ట్విట్టర్లో హైయెస్ట్ ట్రెండ్ కింద నిలిచింది. దీన్నిబట్టి వైసిపి ఈ విషయాన్ని ఎంత బలంగా తీసుకువెళ్లిందనే విషయం అర్థమవుతోంది.



వైసీపీ హయాంలో కట్టిన, ఇంకా నిర్మాణంలో ఉండేటువంటి మెడికల్ కాలేజీలను PPP విధానంలో నడిపించాలంటూ కూటమి ప్రభుత్వం భావించగా వీటిని వైసిపి  వ్యతిరేకించింది. ముఖ్యంగా పేదలకు ఉన్నత విద్య, వైద్య అందించాలనే లక్ష్యంతోనే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మరి మెడికల్ కాలేజీలను కడితే ఇప్పుడు వాటిని ప్రైవేటు భాగస్వామ్యం కింద చేరుస్తారా అంటూ కూటమి ప్రభుత్వం పైన అటు వైసీపీ నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా ఈ మెడికల్ కాలేజీల విషయం పైన మొండిగా ముందుకు వెళితే మాత్రం తామా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేస్తామంటూ బిగ్ స్టేట్మెంట్ జగన్  ఇవ్వడంతో ఇప్పుడు ఏపీ అంతట ఈ విషయం చర్చనీయంశంగా మారింది. మరి ఈ విషయం పైన కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: