బుల్లితెరపై అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదింకచుకున్న బ్యూటీ యాంకర్ వర్షిణి సౌందరాజన్.ఆమె మొదట్లో సినిమా నటిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఆ తర్వాత బుల్లితెరపై చాలా కాలం పాటు సందడి చేసింది. ఇక, ఇప్పుడు మళ్లీ సినిమాల బాట పట్టి సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. అదే సమయంలో వర్షిణి నెట్టింట్లోనూ తెగ సందడి చేస్తోంది. దాంట్లో భాగంగానే లేటెస్ట్ గా ఒక హాట్ వీడియోను కూడా షేర్ చేసింది.

ఐతే ఆమెకు అందంతో పాటు టాలెంట్ ఉన్నప్పటికీ ఛాన్సెస్ బాగా తగ్గిపోయాయి. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకు బుల్లితెరపై ఛాన్స్‌లు వచ్చాయి. దీంట్లో భాగంగానే 'ఢీ' షోలో మెంటర్‌గా సందడి చేసి ఫుల్ పాపులర్ అయింది. ఐతే తర్వాత 'పటాస్' షోతో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఈ అమ్మడు పలు ఛానెళ్లలో ప్రసారం అయిన అనేక షోలకు పని చేసింది.

బుల్లితెరపై చాలా ఏళ్ల పాటు యాంకర్‌గా, ఆర్టిస్టుగా ఎన్నో రకాల షోలకు హోస్ట్ చేసిన వర్షిణి సౌందరాజన్ ఇటీవల స్టార్ మాలో వచ్చిన 'కామెడీ స్టార్స్' షో తర్వాత మాత్రం బ్రేక్ తీసుకుంది. ఈ క్రమంలోనే సుమంత్ 'మళ్లీ మొదలైంది' అనే మూవీలో లీడ్ రోల్ చేసింది. కానీ ఆ మూవీ కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.ఐతే వర్షిణి మళ్ళా సమంత 'శాకుంతలం' మూవీలోనూ చేసింది.

ఇటీవల కాలంలో బుల్లితెరపై కనిపించని వర్షిణి సౌందరాజన్ ఎక్కువగా మూవీస్లపైనే ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే కొన్ని పెద్ద చిత్రాల్లో సైతం భాగం అయింది. అలాగే, మరికొన్ని సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. ఈ విషయాన్నిఈ మధ్యనే ఆమె స్వయంగా వెల్లడించింది. అలానే కొన్ని ఓటీటీ సంస్థల్లో వెబ్ సిరీస్‌లు, షోలు చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది.

ఐతే సోషల్ మీడియా ద్వారా తనదైన స్టైల్లో తెగ హడావిడి చేస్తోన్న యాంకర్ వర్షిణి సౌందరాజన్ అప్పుడప్పుడూ తన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది.ఐతే, వాటిలో ఎక్కువగా ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగినవే ఉంటున్నాయి. ఈ విధంగా అందాల ఆరబోతతో రచ్చ చేస్తున్న ఈ భామ తన ఫిగర్‌తో కుర్రాళ్లకు హీట్ ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: