టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం ప్రస్తుతం మీటర్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. రమేష్ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి ... శ్రీ కార్తిక్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కిరణ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ టీజర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. 

మూవీ టీజర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ప్రస్తుతం ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ నుండి మొదటి సాంగ్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ నుండి "చమ్మక్ చమక్ పోరి" అనే లిరికల్ వీడియో సాంగ్ ను మార్చి 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  శ్రీ కార్తిక్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటికే కిరణ్ ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. మరి మీటర్ మూవీ తో కిరణ్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి. ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: