ప్రస్తుతం ప్రైమ్ మీడియా సంస్థ "యూఎస్" లో వరుస సినిమాల హక్కులను దక్కించుకుంటూ వస్తుంది.  అందులో భాగంగా ఈ సంస్థ ఈ మార్చి 30 వ తేదీన విడుదల కాబోయే  సినిమాల "యూ ఎస్" హక్కులను దక్కించుకుంది. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం. నాచురల్ స్టార్ నాని హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ "యూ ఎస్" హక్కులను ప్రైమ్ మీడియా సంస్థ దక్కించుకుంది.

 ఈ మూవీ మార్చి 30 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ పై యుఎస్ లో కూడా మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి. హిందీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి అజయ్ దేవగన్ తాజాగా బోలా అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ యొక్క యూ ఎస్ హక్కులను కూడా ప్రైమ్ మీడియా సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ ని 30 తేదీన విడుదల చేయనున్నారు.

తమిళ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్న విదూతలై పార్ట్ 1 మూవీ ని మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ యొక్క యూ ఎస్ హక్కులను కూడా ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. వీటితో పాటు హాయ్ సాలా అనే మూవీ యూ ఎస్ హక్కులను కూడా ప్రైమ్ మీడియా సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ కూడా మార్చి 30 వ తేదీన విడుదల కానుంది. అలాగే పాతు తల అనే మూవీ యొక్క యూ ఎస్ హక్కులను కూడా ప్రైమ్ మీడియా సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ ని కూడా మార్చి 30 వ తేదీన విడుదల కానుంది. ఇలా ఈ మార్చి 30 వ తేదీన విడుదల కాబోయే 5 సినిమాల యొక్క హక్కులను ప్రైమ్ మీడియా సంస్థ దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: