ఇక పుష్ప సినిమా ని మొదట కేవలం తెలుగులోనే విడుదల చేయాలనుకున్నారు.. కానీ ఆ తర్వాత బడ్జెట్ స్టోరీ మీద నమ్మకం ఉండడంతో ఇతర భాషలలో కూడా విడుదల చేశారు సుకుమార్.. ఇక పుష్ప సినిమా తమిళంలో విడుదలై భారీగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా రూ.300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించింది..ఇక అక్కడ తమిళ మార్కెట్ ని చేదించిన ఏకైక హీరోగా కూడా పేరు పొందారు అల్లు అర్జున్. ఈ విషయాన్ని తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం అధ్యక్షుడు తిరుపూర్ సుబ్రహ్మణ్యం ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది.
ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.. ఏది ఏమైనా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమిళనాడులో తన మార్కెట్ తో బాగా పాపులారిటీ అవుతున్నారు.. పుష్ప -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నారు. ఈ సినిమానీ పాన్ విడుదల చేయడం జరుగుతోంది.. ఈ చిత్రాన్ని కూడా రూ.1000 కోట్ల టార్గెట్తో విడుదల చేయబోతున్నట్లు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. మరి పుష్ప-2 చిత్రంతో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారు చూడాలి మరి అల్లు అర్జున్. అల్లు అర్జున్ తదుపరి చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లేవగానే విడుదల చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి