తాజాగా శృతిహాసన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హీరోల వయసును పట్టించుకోనని నేను నటించిన సినిమాలన్నిటినీ గురించి కూడా చెప్పుకొచ్చింది. సీనియర్ హీరోలకు జోడిగా నటించడం గురించి కొంతమంది తనని విమర్శలు చేశారని కానీ అసలు తన గురించి పట్టించుకోలేదని తెలియజేసింది శృతిహాసన్ అలాగే వివాహం గురించి కూడా మాట్లాడుతూ.. జీవితంలో వివాహం అనేది ఒక భాగం అని తెలియజేసింది దాని గురించి ఇప్పుడప్పుడే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా తెలిపింది.
హిందీలో తన సినిమా కెరియర్ మొదలయ్యింది.. పవన్ హీరోగా తెరకెక్కించిన గబ్బర్ సింగ్ సినిమాతో తన జాతకం మారిపోయిందంటూ తెలియజేసింది.మా నాన్న బ్యానర్ లో తెరకెక్కి సినిమాలలో నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా వదులుకోనని తెలియజేసింది శృతిహాసన్. ప్రస్తుతం హీరోయిన్గా శృతిహాసన్ ఒకో సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. శృతిహాసన్ గతంలో ఎన్నో రూమర్స్ కూడా వినిపించాయి ఈమె ఎక్కువగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది.. ప్రస్తుతం శృతిహాసన్ చేసిన ఈ కామెంట్లు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి