ఈ సినిమా అయిపోయిన వెంటనే తమిళ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా చిరంజీవి మాత్రం యంగ్ హీరోలకు వరుస అవకాశాలు ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి సమయంలోనే డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బింబిసారా సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి హైప్ క్రియేట్ చేసుకున్నారు డైరెక్టర్ వశిష్ట. కళ్యాణ్ రామ్ తో కలిసి నటించిన ఈ పీరియాడికల్ డ్రామా చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. చిరంజీవి కూడా ఈ డైరెక్టర్ ని అభినందించడం జరిగింది.
దీంతో చిరంజీవి వశిష్టతను కలవడంతో అతను కథ రాస్తున్నాడని త్వరలోనే అధికారికంగా ఒక ప్రకటన వెలుపడే అవకాశం ఉందని నెటిజన్లు పలు రకాలుగా వార్తలు సృష్టిస్తున్నారు. దీంతో మెగా అభిమానులు డైరెక్టర్కు అసలు ఊపిరానివ్వకుండా చేస్తున్నట్లు సమాచారం ఎక్కడ వెళ్ళినా కూడా చిరంజీవితో సినిమా అలా ఉండాలి ఇలా ఉండాలి అని తెలియజేస్తున్నట్లు సమాచారం దీంతో డైరెక్టర్ కొద్దిగా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. చిరంజీవి 156 చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ట మరియు యు వి క్రియేషన్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన త్వరలోనే వేటుపడే అవకాశం ఉన్నది. అయితే ఈ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సీక్వెల్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి