ఇప్పటికే కొంతమంది సినీ తారలు అగ్ర హీరోల సినిమాల లో ఎంతో బిజీ అయిపోయారు. ప్రభాస్ రాబోయే సినిమాల లో ఎక్కువగా బాలీవుడ్ స్టార్స్ కనిపించబోతున్నారనీ తెలుస్తుంది.
అలాగే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ చేయబోయే బుచ్చిబాబు ప్రాజెక్టు లో కూడా ఒక బాలీవుడ్ స్టార్ ప్రధాన పాత్ర లో కనిపించబోయేకూడా అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక నందమూరి బాలకృష్ణ సినిమా లో కూడా ఒక బాలీవుడ్ స్టార్ ప్రధాన విలన్ గా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం.
దర్శకుడు అనిల్ రావిపూడి తెరపైకి తీసుకురాబోతున్న ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్ గా NBK 108 గా సెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే పవర్ ఫుల్ టైటిల్ ను పోస్టర్ ద్వారా విడుదల చేయబోతున్నారట.అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నట్లు సమాచారం.. ఇప్పటికే హరి హర వీరమల్లు సినిమాలో విలన్ పాత్రలో కనిపిస్తున్న ఈ యాక్టర్ ఇప్పుడు బాలకృష్ణ సినిమాల్లో కూడా భయంకరమైన ప్రతినాయకుడి పాత్ర లో మెప్పించబోతున్నట్లుగా సమాచారం..
దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి కమర్షియల్ ఫార్మాట్లో మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెంచుకునే ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నాడనీ తెలుస్తుంది.. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ తెలంగాణ యాస లో మాట్లాడబోతున్నాడట.. ఇక శ్రీ లీల బాలకృష్ణ కూతురుగా కనిపించపోతుండ గా కాజల్ అగర్వాల్ బాలయ్య బాబుకు జోడి గా నటిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుక గా విడుదల చేయాలి అని భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి