ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలలో భాగంగా అఖిల్ కి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక అఖిల్ సైతం ఆ ప్రశ్నలకు అంతే ఇంట్రెస్టింగ్ గా ఆన్సర్లు కూడా చెబుతూ ఉన్నాడు. ఇకపోతే ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అతనికి ఎస్ఎస్ఎంబి 29 సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. దీంతో అప్పుడు అఖిల్ ఇచ్చిన రెస్పాన్స్ కాస్త ప్రస్తుతం స్టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తావా అని డైరెక్టర్ అడిగితే మీరేం చేస్తారు అని యాంకర్ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు అఖిల్ చెప్పిన సమాధానం ఆసక్తికరంగా మారింది. అయితే అఖిల్ రెస్పాన్స్ తో ఇక అభిమానులందరూ తమకు నచ్చిన సమాధానాలను వెతుక్కుంటున్నారు అని చెప్పాలి. రూమర్స్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్పండి.. వారిద్దరూ నా కుటుంబ సభ్యుల్లాంటివారు.. అయినా రాజమౌళి సినిమాకి ఎవరైనా నో చెబుతారా చెప్పండి అంటూ అఖిల్ ఒక చిన్న నవ్వు నవ్వాడు. దీంతో ఛాన్స్ వస్తే వదులుకోను అన్నాడని కొంతమంది.. ఇప్పటికే ఛాన్స్ వచ్చిందేమో అని మరి కొంతమంది ఈ విషయంపై చర్చించుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి