తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడుగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ తాజాగా ఉగ్రం అనే వైవిధ్యమైన మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లో నరేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కి విజయ్ కనకమెడల దర్శకత్వం వహించాడు. ఇది ఈ దర్శకుడి కి కెరియర్ లో రెండవ సినిమా. ఇది వరకు నరేష్ హీరో గా రూపొందిన నాంది మూవీ కి దర్శకత్వం వహించాడు. ఆ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే నరేష్ ... విజయ్ కాంబినేషన్ లో రూపొందిన రెండవ మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ ని ఈ రోజు అనగా మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.

సినిమా నైజాం ఏరియాలో 110 థియేటర్ లలో విడుదల కానుండగా , సీడెడ్ ఏరియాలో 45 , ఆంధ్ర ఏరియాలో 165 థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా మొత్తం గా రెండు తెలుగు రాష్ట్రాల్లో 320 థియేటర్ లలో విడుదల కానుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా 45 థియేటర్ లలో విడుదల కానుండగా , ఓవర్ సీస్ లో 150 థియేటర్ లలో విడుదల కానుంది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 515 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది . ఇది ఇలా ఉంటే ఉగ్రం మూవీ తో నరేష్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: