
ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మొదటిసారి ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్ని ఎడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చరణ్ తేజ ఉప్పలపాటి, కే రాజశేఖర్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇందులో ప్రముఖ బాలీవుడ్ హీరో మకరం దేశ్ పాండే కీలకపాత్ర పోషిస్తుండగా, కమెడియన్ అభినవ్ కూడా స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారు. హీరోయిన్గా ఐశ్వర్య మీనన్ నటిస్తుండగా సన్యా ఠాకూర్ రెండో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఆర్యన్ రాజేష్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. జూన్ 29 2023న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను తెలుగు, తమిళ్ ,హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ టీజర్ విషయానికి వస్తే.. ఢిల్లీలో చారిత్రాత్మక ప్రదేశం అయిన ఐకానిక్ ల్యాండ్ మార్క్ కర్తవ్యా పాత్ వద్ద భారీ వేదికను ఏర్పాటు చేసి పాన్ ఇండియా స్థాయిలో టీజర్ హైలైట్ అయ్యేలా చేశారు. ఈ సినిమాలో నిఖిల్ ఒక స్పైగా కనిపించబోతున్నట్లు టీజర్ లోని రివీల్ చేయడం జరిగింది. ఇక సుభాష్ చంద్రబోస్ యొక్క రహస్యాల ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమా టీజర్ నేడు అందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.