ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యింది. కృతి శెట్టి ఈ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా కృతి శెట్టి నాగ చైతన్య హీరో గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయ్యిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

అలాగే తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా కృతి శెట్టి తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎల్లో కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన ఈ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: