మెగా డాటర్ గా నిహారికకు మెగా అభిమానులలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆమె సినిమాలను తన కెరియర్ గా ఎంచుకావడంతో మంచి హీరోయిన్ గా ఆమె సెటిల్ అవుతుందని చాలమంది భావించారు. అయితే ఆమె పెళ్ళి చేసుకోవడంతో గ్లామర్ ఫీల్డ్ కు దూరం అవుతుందని అంచనాలు వచ్చాయి. ఎవరు ఊహించని విధంగా ఆమె వైవాహిక జీవితం పై వచ్చిన రకారకాల రూమర్ల పై ఖండన రాకపోవడంతో వచ్చిన గాసిప్పులు నిజమే అన్న అభిప్రాయంలో చాలామంది ఉన్నారు.


కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నిహారిక ఈమధ్యనే తిరిగి యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న విషయంతెలిసిందే. ఇప్పుడు ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు వెనక ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేక మెగా అభిమానులు మాత్రమే కాకుండా నెటిజన్ లు కూడ తలపట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమధ్య టర్కీకి హాలిడే ట్రిప్ కోసం వెళ్ళిన నిహారిక బికినీ వేసుకుని కొన్ని ఫోటోలను షేర్ చేసి చాలామందికి షాక్ ఇచ్చింది.


దీనితో నిహారిక తన గ్లామర్ డోస్ ను ఎందుకు పెంచింది అంటూ కొందరు షాక్ అయ్యారు. ఇది చాలదు అన్నట్లుగా ఈమధ్య ఆమె లేటెస్ట్ గా హాలిడే ట్రిప్ కోసం బాలీ వెళ్ళి అక్కడ రకరకాల డ్రెస్ లతో హంగామా చేయడమే కాకుండా ఒక పబ్ లో హడావిడి చేస్తూ కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీనితో ఆమె ఇంత ఫాస్ట్ గా ఎలా మారిపోయింది అంటూ మరికొందరు షాక్ అవుతున్నారు. చాలకాలం నటనకు దూరంగా ఉన్న నిహారిక ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

ఒక బ్రిటీష్ వెబ్ సిరీస్ ఆధారంగా నిర్మాణంలో ఉన్న ఈ వెబ్ సిరీస్ లో నిహారిక ఎవరు ఊహించని ఒక వివాదాస్పద పాత్రను పోషిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. గతంలో ఇలాంటి బోల్డ్ గా ఉండే పాత్రలలో సమంత అమలాపాల్ నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే కోట్లాది మంది అభిమానులు కలిగిన మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన నిహారిక ఇంత ఫాష్ట్ గా ఎందుకు ఉంది ఒకవేళ సినిమాలలో అవకాశాల కోసం ఇలాంటి గ్లామర్ షోను ప్రదర్శిస్తోందా అన్న విషయాలను తేల్చుకోలేక చాలమంది కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్..
మరింత సమాచారం తెలుసుకోండి: