తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో ధనుష్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో కమర్షియల్ మూవీ లలో ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో నటించి తన నటన తో ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు. ఈ నటుడు నటించిన ఎన్నో మూవీ లు తెలుగు లో కూడా విడుదల అయ్యి అద్భుతమైన విజయాలను సాధించడంతో ధనుష్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇది ఇలా ఉంటే ధనుష్ తన కెరియర్ లో మొట్ట మొదటి సారి ఒక తెలుగు మూవీ లో హీరో గా నటించాడు. అదే సార్. ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ్ లో కూడా విడుదల అయింది. తెలుగు లో సార్ అనే మూవీ తో విడుదల అయిన ఈ సినిమా తమిళ్ లో వాతి అనే టైటిల్ తో విడుదల అయింది.

మూవీ కి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా ... తెలుగు నిర్మాత సూర్య దేవర నాగవంశీ ఈ మూవీ ని నిర్మించాడు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే థియేటర్ లలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెరపై ప్రసారం కానుంది.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమిని సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీ లో జూన్ 4 వ తేదీన ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు జెమిని ఛానల్ లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ కి బుల్లి తెరపై ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: