సూపర్ స్టార్ కృష్ణ తేనె మనసులు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి మూల స్తంభంగా నిలిచారు.అంతకు ముందు చిన్న చిన్న సినిమాలలో పాత్రలు పోషించినప్పటికీ హీరోగా బ్రేక్ ఇచ్చింది మాత్రం తేనె మనసులు సినిమా అని చెప్పవచ్చు.. ఇక గూడచారి 116 సినిమాతో మంచి హిట్ పొంది అప్పటినుంచి కూడా మరింత పేరు దక్కించుకున్న ఈయన కెరియర్ లో 300కు పైగా సినిమాలు చేసి రికార్డు ను సృష్టించారు. అంతేకాదు 16 సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు కృష్ణ.

ఇక కృష్ణ ప్రభుత్వ సహకారంతో సొంత స్టూడియో ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదే పద్మాలయ స్టూడియో ను హైదరాబాదులో కృష్ణ నెలకొల్పడం జరిగింది. కృష్ణ బ్రహ్మాస్త్రం, కృష్ణ గారడి, మహామనిషి వంటి సినిమాలు చేసినా పెద్దగా క్లిక్ అయితే అవ్వలేదు. దాంతో అభిమానులు  కూడా కొంత కలవరపాటుకు గురి అయ్యారు. దాంతో కృష్ణకి ఒక ఆలోచన వచ్చిందట. ఆస్థాన రచయిత అయినటువంటి త్రిపురనేని మహారధికి తన ఆలోచనను చెప్పగా వెంటనే కథను రెడీ చేశారట.

అత్యాధునిక సాంకేతిక నిపుణులతో ఆ కథను సినిమాగా మార్చి రెండు భాషల్లో తీసుకురావాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ సినిమాని స్వయంగా కృష్ణ గారే నిర్మించి మరి దర్శకత్వం వహించడం విశేషం అయితే అప్పటికే మూడు ఫ్లాపుల తో వున్న కృష్ణ ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ పొందాలని ఎవరు ఊహించని విధంగా చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.. ఇక ఆ చిత్రం పేరే సింహాసనం. ఈ సినిమాతో ప్రయోగం చేయొద్దు అని కృష్ణకి సినిమా పెద్దలు చెప్పినా  కూడా ఆయన వినకపోవడం. అలాగే ఆయన వేగం చూసుకొని నిర్మాణ సంస్థలు కూడా చాలా భయపడ్డాయి... దాంతో ఆయన తన దగ్గర ఉన్న డబ్బు సరిపోక ఇంటిని కూడా తాకట్టు పెట్టి మరీ ఈ సినిమా కోసం పద్మాలయ స్టూడియోలో రూ.50 లక్షలు ఖర్చు పెట్టి సెట్ వేశారట.

అంతేకాదు సెట్ లో పనిచేసే టెక్నీషియన్లు అందరూ కూడా ఉత్సాహంగా పనిచేయాలని ప్రతి ఒక్కరికి కూడా నాన్ వెజ్ భోజనాలను ఏర్పాటు చేశారట కృష్ణ . మొత్తం ఈ సినిమా కోసం రూ. 2.5 కోట్ల బడ్జెట్ కేటాయించగా.. మొదటి వారం రూ.1.5 కోట్లు రాబట్టి.. ఏకంగా ఫుల్ రన్ ముగిసేసరికి రూ.4.5 కోట్ల షేర్ రాబట్టి భారీ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: