
ఇక సినిమా అవకాశాలు తగ్గుతూ ఉండడంతో ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో తరచు తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు పైన పలువురు నేటిజన్ల సైతం ట్రోలింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే ఆన్లైన్ రమ్మీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఈషా రెబ్బా ఉండడంతో నేటిజెన్లను ఇమెను ట్రోల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో ఇలాంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన రకుల్ ప్రీతిసింగ్ కూడా ఇలాంటి దుస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. యువతను చెడుదారులకు పట్టించే వాటిని సపోర్ట్ చేస్తున్నట్లుగా వీరిని ట్రోల్ చేస్తున్నట్లు సమాచారం.
ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా కలిసి రాలేదు ఈ ముద్దుగుమ్మకు ముఖ్యంగా సెకండ్ హీరోయిన్గా గ్లామర్ పాత్రలలో నటించిన వాటిని రిజెక్ట్ చేయడంతో పాటు తన పాత్రకు ప్రాధాన్యత ఉండే సినిమాలలోనే నటిస్తోంది. ప్రస్తుతం అడపదడపా సినిమాలలో నటిస్తున్న ఈషా రెబ్బా సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ తన అందాలను ప్రదర్శిస్తూ పలు సినిమా అప్డేట్లను సైతం తెలియజేస్తూ ఉంటుంది. మరి రమ్మి విషయంలో వెనక్కి తగ్గుతుందేమో చూడాలి మరి.