మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఉప్పెన మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఈ సినిమాలో ఈ నటి కూడా తన నటనతో , అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఉప్పెన మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈనటి కి వరస అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఇప్పటికే ఈనటి నాని హీరోగా రూపొందిన శ్యామ్ సింగరాయ్ ... రామ్ పోతినేని హీరోగా రూపొందిన ది వారియర్ ... నితిన్ హీరోగా రూపొందిన మాచర్ల నియోజకవర్గం ... సుధీర్ బాబు హీరోగా రూపొందిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ... నాగ చైతన్య హీరోగా రూపొందిన కస్టడీ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లతో పాటు నాగార్జున హీరోగా రూపొందిన బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య ఒక కీలక పాత్రలో నటించగా ... ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడిగా కృతి శెట్టి నటించింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ శర్వానంద్ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కృతి తన సోషల్ మీడియా అకౌంట్ లో వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కృతి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: