యువ హీరో నిఖిల్ కెరీర్ మొదట్లో రొటీన్ సినిమాలు చేసినా స్వామిరారా నుంచి తన పంథా మార్చేశాడు. ఆడియన్స్ కు కొత్తగా ఏదైనా చెబితే దాన్ని కచ్చితంగా సక్సెస్ చేస్తారన్నది కనిపెట్టిన నిఖిల్ కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య ఇలా వరుస ప్రయోగాలు చేస్తూ వచ్చాడు. ఇక కార్తికేయ 2 తో నేషనల్ వైడ్ గా అతని రేంజ్ పెంచింది. ఈ సినిమా వల్ల నిఖిల్ కెరీర్ జెట్ స్పీడ్ అందుకుందని చెప్పొచ్చు.

ముఖ్యంగా చరణ్ మరో ప్రొడక్షన్ హౌజ్ మొదలు పెట్టడం ఆ బ్యానర్ లో పాన్ ఇండియా సినిమా తీయడం లాంటిది చూస్తుంటే నిఖిల్ లక్ మామూలుగా లేదని చెప్పొచ్చు. ది ఇండియా హౌజ్ అని ఒక సరికొత్త ప్రీ ఇండిపెండెంట్ ఫ్రీ ఫైటర్ కథతో నిఖిల్ సినిమా వస్తుంది. అదే పెద్ద సెన్సేషన్ అనిపించగా లేటేస్ట్ గా స్వయంభు అంటూ మరో భారీ సినిమా తన బర్త్ డే నాడు ఎనౌన్స్ చేశాడు నిఖిల్. బాహుబలి రేంజ్ ఎలివేషన్స్ తో ఆ తరహా కథతోనే ఈ స్వయంభు వస్తుందని తెలుస్తుంది.

నూతన దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇక నిఖిల్ తో బోగవల్లి ప్రసాద్ కూడా ఒక సినిమా అనౌన్స్ చేశారు. స్వామిరారా డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ కాంబో సినిమా అనగానే ఫ్యాన్స్ అంచనాలు పెంచుకున్నారు. సో నిఖిల్ సినిమాల లిస్ట్ చూస్తుంటే బాబోయ్ అనిపిస్తుంది. ముఖ్యంగా తనతో సినిమాలు చేస్తున్న యువ హీరోలందరికీ నిఖిల్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడని చెప్పొచ్చు.

నిఖిల్ తన సినిమాల విషయంలో ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నాడో ఈ సినిమాల ఎనౌన్స్ మెంట్ చూస్తే అర్ధమవుతుంది. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ ప్లానింగ్ అదుర్స్ అని చెప్పొచు. ఇక తెలుగు నుంచి మరో పాన్ ఇండియా స్టార్ నిఖిల్ అవతరించబోతున్నాడని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: