కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకోవడానికి ప్రశాంత్ నీల్ ఎంత కారణమో ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన రవి బస్రూర్ మ్యూజిక్, బీజీఎం కూడా అంతే కారణమని చెప్పవచ్చు.

కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవి బస్రూర్ కు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని కుందాపూర్ లో రవి జన్మించారు.

రవి బస్రూర్ పలు సినిమాలకు గీత రచయితగా కూడా పని చేశారు. ఒక్కపూట తిండి కోసం రవి బస్రూర్ కెరీర్ తొలినాళ్ల లో కిడ్నీ అమ్మాలని అనుకున్నారు. ఈ డైరెక్టర్ అనుభవించిన కన్నీటి కష్టాల గురించి తెలిస్తే మాత్రం నిజంగా షాకవ్వాల్సిందేనని చెప్పవచ్చు. రవి బస్రూర్ సినిమాల కోసం పని చేస్తున్నా తన నిజ జీవితం లో సినిమా కష్టాలను అనుభవించారని చెప్పవచ్చు. రవి బస్రూర్ ఒకవైపు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు చిన్నచిన్న పనులు చేశారు.

పెద్దగా చదువుకోని రవి బస్రూర్ కు కెరీర్ తొలినాళ్ల లో లక్ కూడా కలిసిరాలేదు. తాను రైలు టాయిలెట్ లో కూర్చుని ఏడ్చిన సందర్భాలు సైతం ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. తినడానికి తిండి లేకపోవడం, ఇంటి బాధ్యత లు నాపై పడటం తో కిడ్నీ అమ్మడాని కి సిద్ధమయ్యానని రవి బస్రూర్ చెప్పు కొచ్చారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఉగ్రమ్ మూవీ రవి బస్రూర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

సినిమా సక్సెస్ సాధించడంతో రవి బస్రూర్ కు కెరీర్ పరం గా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల మ్యూజిక్, బీజీఎం ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందని సమాచారం అందుతోంది. రవి బస్రూర్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: