సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మరియు న్యాచురల్ స్టార్ నాని 'దసరా' చిత్రాలు మాత్రమే కమర్షియల్ గా తెలుగులో సక్సెస్ అయ్యాయి. మిగిలిన సినిమాలన్నీ కూడా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్స్ గా అయితే నిలిచాయి. పాపం బయ్యర్స్ కి పది రూపాయిలు వస్తే వంద రూపాయిలు దాక పోయింది.ఇలాంటి దరిద్రమైన సమ్మర్ సీజన్ ని టాలీవుడ్ ఇది వరకు ఎప్పుడూ కూడా చూడలేదని తెలుస్తుంది.. ఇప్పుడు ట్రేడ్ మొత్తం లాభాలు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న సినిమా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన 'ఆదిపురుష్ ' చిత్రం.

సుమారుగా 450 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16 వ తారీఖున అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా అయితే విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాతో థియేటర్స్ మొత్తం కళకళలాడుతూ టాలీవుడ్ కి పూర్వ వైభవం రప్పిస్తుందని బలమైన నమ్మకం తో అయితే ఉంది ట్రేడ్.ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అమెరికా లో ప్రారంభం అయ్యింది, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని చూస్తూ ఉంటే యావరేజి అడ్వాన్స్ బుకింగ్స్ అని అక్కడి ట్రేడ్ పండితులు కూడా చెప్తున్నారు. ఇక పోతే ఈ చిత్రానికి సంబంధించిన అన్నీ ప్రాంతాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి అయ్యినట్టు తెలుస్తుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణకు కలిపి 125 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందని తెలుస్తుంది. నైజాం ప్రాంతం హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కొనుగోలు చేసిందని తెలుస్తుంది..ఓవర్సీస్, కర్ణాటక వంటి ప్రాంతాలను కూడా కలిపితే కేవలం తెలుగు వెర్షన్ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 160 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు రావాలి అని అయితే ఈ సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ చూసి, అంత వసూళ్లు రావడం సాధ్యమేనా అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమా 'రాధే శ్యామ్ ' రేంజ్ ప్రీమియర్స్ గ్రాస్ ని కూడా రాబట్టేలా  అయితే లేదు. హిందీ అడ్వాన్స్ బుకింగ్స్ కి ఒక్క టికెట్ కూడా కదలడం లేదని సమాచారం.. అద్భుతమైన టాక్ వస్తే తప్పా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం అని అంటున్నారటా ట్రేడ్ పండితులు

మరింత సమాచారం తెలుసుకోండి: