ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ... ఎన్నో సినిమాల్లో నటించి ... యాంకర్ గా ... నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకొని ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల అభిమానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా శ్రీ ముఖి వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే ... వరుస సినిమాల్లో కూడా నటిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ నటి మెగాస్టార్ చిరంజీవి హీరో గా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి భోళా శంకర్ అనే సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. 

మూవీ లో ఈ ముద్దు గుమ్మ పై చాలా సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్ గా రూపొందినటువంటి ఖుషి మూవీ లోని నడుం సీన్ కూడా చిరంజీవి ... శ్రీ ముఖి ల మధ్య భోళా శంకర్ మూవీ యూనిట్ చిత్రీకరించినట్లు ... ఆ సీన్ అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా వరుస సినిమాలతో ... టీవీ షో లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ ముఖి తన సోషల్ మీడియా అకౌంట్ లో పర్పుల్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. శ్రీ ముఖి కి సంబంధించిన ఈ క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: