
ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది. బాగా వర్క్ అవుట్ లు చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను కూడా పంచుకుంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఈమెకు చదువుకునే రోజుల నుంచి ఒక అలవాటు ఉందని తెలుస్తుంది.అదేదో కాదు.. డాన్స్ చేయటం. మామూలుగా ఈ ముద్దుగుమ్మ సినిమాలలో చేసే డాన్స్ మామూలుగా ఉండదని చెప్పాలి. మంచి ఎనర్జీ తో డాన్స్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఏ స్టెప్పునైన ఇట్టాగే చేస్తుంది. అయితే ఈమెకు ఇది ఇప్పుడు నేర్చుకున్న విద్య.. అది చిన్నప్పటినుంచి నేర్చుకున్న విద్య అని తెలుస్తుంది. తాజాగా తమన్నా ఇన్స్టాల్ లో తన చిన్ననాటి ఫోటో షేర్ చేసుకుంది. అందులో తను స్కూల్ డేస్ లో జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్స్లలో వేదికపై డాన్స్ చేసినట్లు కనిపించింది. ఇక అందులో తను వైట్ అవుట్ ఫిట్ తో కనిపించగా.. ఆ సమయంలో కూడా తను తెలుపు రంగులో చాలా అందంగా ఉంది. ఇక ఆ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో.. ఆ ఫోటో చూసి తన అభిమానులు మరోసారి ఫిదా అవుతున్నారు. తమన్నాకు చిన్నప్పటినుండి డాన్స్ చేయటం ఇష్టమేమో.. చాలా గ్రేట్ అంటూ పొగుడుతున్నారు. ఇక మరి కొంతమంది తమన్నా మామూలు గడుసు అమ్మాయి కాదు కదా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.