‘ఆదిపురుష్’ మూవీకి ప్రస్తుతం కొనసాగుతున్న మ్యానియాను చూసి డార్లింగ్ అభిమానులు మంచి జోష్ లోకి వెళ్ళిపోతున్నారు. ‘బాహుబలి 2’ తరువాత సరైన హిట్ లేక సతమతమైపోతున్న ప్రభాస్ కు ఈమూవీ ఒక ట్రెండ్ సెటర్ గా మారుతుందని అభిమానుల అంచనా. దీనికితోడు ఈమూవీని సపోర్ట్ చేస్తూ రణబీర్ కపూర్ రామ్ చరణ్ లాంటి సెలెబ్రెటీలు ఈసినిమాకు సంబంధించిన టిక్కెట్లు వేల సంఖ్యలో కొని చారిటీగా పేదలకు చిన్న పిల్లలకు వృద్ధులకు ఇస్తున్న విషయానికి సంబంధించిన వార్తలు ప్రభాస్ అభిమానులకు మరింత జోష్ ను పెంచుతున్నాయి.


ఈ పరిస్థితుల మధ్య యంగ్ హీరోయిన్ కస్తూరి శంకర్ ‘ఆదిపురుష్’ లో ప్రభాస్ శ్రీరాముడి గెటప్ ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ప్రభాస్ శ్రీరాముడి గెటప్ తనకు ఏమాత్రం నచ్చలేదని అతడి గెటప్ ను చూస్తుంటే తనకు మహాభారతంలో కర్ణుడి పాత్ర గెటప్ లా అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేసింది.


అంతేకాదు తాను అనేక ఆధ్యాత్మిక పండితులను అలాగే రచయితలను శ్రీరాముడి వేషధారణా గురించి అడిగానని వారెవ్వరు ఏగ్రంధంలో చూసినా శ్రీరాముడు మీసంతో ఉన్నట్లు వ్రాయబడలేదు అంటూ చెప్పిన విషయాన్ని కూడ తన సోషల్ మీడియా ఎకౌంట్ లో షేర్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ ప్రభాస్ అభిమానులకు విపరీతమైన ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.


దీనితో ఆమెను టార్గెట్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ కూడ పెడుతున్నారు. చాల ఉన్నత విధ్యా వేత్తల కుటుంబం నుండి వచ్చిన కస్తూరి శంకర్ మిస్ చెన్నై మిస్ ఫెమినా గా ఎంపిక అవ్వడమే కాకుండా అనేక ఫ్యాషన్ షూట్స్ కూడ ఇచ్చింది. స్త్రీల సమస్యల పై చాల అనర్గళంగా మాట్లాడే ఆమె మంచి కథలతో తీసే చిన్న సినిమాలలో మాత్రమే నటిస్తాను పెద్దహీరోల సినిమాలు తనకు ఆశక్తిలేదు అంటూ చెప్పిన సందర్భంగా కూడ ఉంది. ఏమైనా ఆమె చేసిన కామెంట్స్ యాంటి ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆయుధంగా మారాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: