అద్భుతమైన నటి అయినటువంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి తన కెరీర్ లో ఎన్నో కమర్షియల్ సినిమాలలో అందచందాలను ఆరబోయడం మాత్రమే కాకుండా ... ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో తన నటనతో కూడా ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ తాజాగా దసరా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. నాని హీరోగా నటించిన ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. 

మూవీ ద్వారా కీర్తి సురేష్ కు కూడా ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈ నటి చిరంజీవి హీరో గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తెలుగు తో పాటు ఈ నటి తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న కీర్తి సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈనటి అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: