ప్రాజెక్ట్ కె అంటే అది మామూలు సినిమా కాదు. హాలీవుడ్ టెక్నిషియన్స్ తో చేస్తున్న సినిమా. ఇక మరోపక్క మహేష్ గుంటూరు కారం కూడా సంక్రాంతి రేసులో నిలుస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటుగా రవితేజ ఈగల్ కూడా పోటీకి వస్తుంది. రవితేజ పోటీకి రావడం వల్ల ఆ రెండు సినిమాల కన్నా ఆ రెండు సినిమాల వల్ల రవితేజకి బాగా ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చు. అయినా కూడా పెద్ద సినిమాలు వస్తున్నాయని తెలిసినా పొంగల్ కి సినిమా వదలాలని అనుకున్నారు అంటే సినిమాలో కచ్చితంగా గట్టి విషయం ఉండి ఉంటుంది.
మొత్తానికి రవితేజ పొంగల్ ఫైట్ కి షురూ అంటున్నాడు. ప్రభాస్ ప్రాజెక్ట్ కె, మహేష్ గుంటూరు కారం రెండు సినిమాలు రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఒకవేళ రిలీజ్ టైం కి రవితేజ సినిమానే వాయిదా పడొచ్చేమో కానీ వచ్చే సంక్రాంతికి మహేష్ ప్రభాస్ ఫైట్ మాత్రం పకా ఉండి తీరుతుంది. ఈ సినిమాల్లో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుంది అన్నది చూడాలి. మరి ఈ మూడు సినిమాలతోనే సంక్రాంతి ఫైట్ ఆపేస్తారా లేదా మరి కొన్ని సినిమాలు షెడ్యూల్ చేస్తారా అన్నది కూడా తెలియాల్సి .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి