గతంలో కూడా రామ్ పెళ్ళికి సంబంధించిన రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ రూమర్ చాలా బలంగా వినిపిస్తోంది. త్వరలోనే రామ్ ఫ్యామిలీ నుంచి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది కంప్లీట్ గా పెద్దలు కుదిర్చిన వివాహం అని వార్తలు వస్తున్నాయి. నితిన్, నిఖిల్, రానా ఇలా టాలీవుడ్ యంగ్ హీరోలంతా పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయ్యారు. వీళ్ళ ఏజ్ గ్రూప్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రామ్ అని చెప్పాలి. ప్రభాస్ పెళ్లి గురించి అయితే ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. మొత్తంగా రామ్ పెళ్లి గురించి న్యూస్ వస్తుండడంతో అతడి ఫ్యాన్స్ ఫహ్యాపీగా ఉన్నారు.
రామ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఇటీవల విడుదలైన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక రామ్ తనకి ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పూరి జగన్నాధ్ తో మరోసారి వర్క్ చేయనున్నారు. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ చిత్రం ఉండబోతోంది. డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి