టాలీవుడ్ ,కోలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించిన హన్సిక మోత్వానీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ ఖతూరియాను 2022 డిసెంబర్ 4న స్నేహితులు, కుటుంబ సమక్షంలో జైపూర్లో చాలా గ్రాండ్గా వివాహం చేసుకుంది. కానీ వివాహమైన రెండేళ్లకే వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యి చాలాకాలంగా వేరువేరుగా జీవిస్తున్నారు. దీంతో ఇప్పుడు వీరు విడాకుల బాట పట్టినట్లు తెలుస్తోంది. తమకు విడాకులు మంజూరు చేయాలని హన్సిక బాంద్రా ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాజాగా న్యాయస్థానం వీరి విడాకులను మంజూరు చేసినట్లు సమాచారం.



హన్సిక, సోహైల్ 2024 జులై 2వ తేదీ నుంచి ఇద్దరు విడివిడిగా జీవిస్తున్నారని హన్సిక తరపున లాయర్ కోర్టుకి  తెలియజేశారు. అయితే విడాకుల కేసు విచారణ సమయంలో భర్త నుంచి ఎలాంటి భరణం మాత్రం తీసుకోలేదట హన్సిక. కోర్టులో ఈ విషయంలో ఎలాంటి వాదనలు కూడా జరగలేదని సమాచారం. అయితే ఈ విషయం విన్న హన్సిక అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. గత కొద్దిరోజులుగా వీరిద్దరిపైన ఇలాంటి రూమర్స్ వినిపించినప్పటికీ ఇప్పుడు తాజాగా అది నిజమయ్యాయి. ముఖ్యంగా సోహైల్ కి రెండో వివాహమని హన్సికకు తెలిసే మళ్లీ వివాహం చేసుకుంది. సోహైల్ మొదటి భార్య ఎవరో కాదు హన్సిక స్నేహితురాలే. ఆ తర్వాత హన్సికను ప్రేమించి పెళ్లి చేసుకున్న సోహైల్ ఇప్పుడు ఈ వివాహ బంధం కూడా పెటాకులయ్యింది.


హన్సిక చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తన అందం, అభినయంతో ఆకట్టుకున్న హన్సిక ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో నటించింది.వివాహం అనంతరం సినిమాలు తగ్గించిన హన్సిక, చివరిగా 2024లో విడుదలైన గార్డియన్ అనే చిత్రంలో నటించింది. హన్సిక మరి విడాకుల అనంతరం సినిమాలలో తిరిగి నటిస్తుందా? లేకపోతే ఏంటా అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: