నటి ప్రియమణి అంటే ప్రత్యేకంగా సౌత్ సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్. ఈమె సౌత్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా కొన్ని సంవత్సరాలు ఇండస్ట్రీని ఏలింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తన ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వేసుకొని సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన సినీ కెరియర్ లో కొనసాగింది.అయితే కొత్త నీరు వస్తున్నా కొద్ది పాతనీరు పక్కకు పోతుంది అన్నట్లుగా ఇండస్ట్రీ గా కొత్త కొత్త హీరోయిన్లు వస్తున్నా కొలది సీనియర్ హీరోయిన్ల హవా తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి ప్రియమణి దూరం అవ్వాల్సి వచ్చింది.ఇక ప్రియమణి ముస్తఫా రాజ్  అనే బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంది.అయితే ముస్తఫా రాజుకి అప్పటికే పెళ్ళై విడాకులు అయ్యాయి.కానీ రెండో పెళ్లి అని తెలిసినా కూడా ప్రియమణి ముస్తఫా రాజ్ ని పెళ్లి చేసుకుంది. ఇక ప్రియమణి గురించి అప్పట్లో ఇండస్ట్రీలో చాలానే టాక్స్ వినిపించాయి.మరీ ముఖ్యంగా సినిమాలో నటిస్తున్న టైంలో ప్రియమణి  కి చాలామంది హీరోలతో ఎఫైర్స్ నడిపించింది అనే టాక్ కూడా ఉంది.

అలాగే ప్రియమణి తరుణ్ప్రేమ విషయం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు తరుణ్ తల్లి రోజా రమణి స్వయంగా ప్రియమణి దగ్గరికి వెళ్లి నా కొడుకుతో నీకు పెళ్లి చేస్తాను అని కూడా చెప్పిందట. కానీ మేము జస్ట్ ఫ్రెండ్స్ అని ప్రియమణి ఆ పెళ్ళికి అడ్డు చెప్పిందట.అయితే ప్రియమణి అలా చెప్పడానికి వేరే కారణం ఉందట. అదేంటంటే ప్రియమణి గతంలో సినిమాల్లో నటిస్తున్న టైంలో ఓ సీనియర్ హీరోతో ప్రేమలో పడింది.

చాలా రోజులు వీరి మధ్య రిలేషన్ కూడా కొనసాగిందట. ఇక ఎప్పుడైతే నవ వసంతం సినిమాలో తరుణ్ తో నటించిందో అప్పటినుండి తరుణ్ తో ప్రేమలో పడిందట.అలా ఆ సినిమా తర్వాత చాలా రోజుల తరుణ్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిందట. కానీ పెళ్లి చేసుకుందాం అనుకునే టైం లో ప్రియమణి ముందుగా ప్రేమించిన ఆ హీరో ప్రియమణి ని బ్లాక్మెయిల్ చేశాడట. దాంతో ప్రియమణి తరుణ్ కి దూరం కావాల్సి వచ్చిందట.లేకపోతే ప్రియమణి తరుణ్ ని పెళ్లి చేసుకొని ఉండేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: