టాలీవుడ్ అందాల చందమామగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ మరికొన్ని రోజుల్లో.. సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా అంటే మాత్రం అవుననే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. దాదాపు దశాబ్ద కాలం క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజల్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.


 మొదటి సినిమాలోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది.. ఇక తర్వాత తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఎన్నో బ్లాక్బస్టర్లను ఖాతాలో వేసుకుంది ఈ పంజాబీ భామ. అయితే సీనియర్ హీరోయిన్ అని ముద్ర పడినప్పటికీ యంగ్ హీరోల సరసన.. ఛాన్స్ కొట్టేసి తనకు తిరుగులేదు అని నిరూపించింది కాజల్ అగర్వాల్. ఇప్పుడు వరకు 55 కు పైగా సినిమాల్లో నటించింది. అయితే తన స్నేహితుడు గౌతమ్ను పెళ్లి చేసుకుని దాంపత్య బంధంలోకి అడుగు పెట్టింది. వీరికి కొడుకు కూడా ఉన్నాడు.


 ఇకపోతే ఇటీవల కాజల్ అగర్వాల్ పెట్టిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం అంగీకరించిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అంటూ ఒక పోస్ట్ పెట్టింది కాజల్ అగర్వాల్. దీంతో ఇక కాజల్ అగర్వాల్ తన సినీ కెరియర్ కు పుల్ స్టాప్ పెట్టబోతుంది అన్న వదంతులకు ఈ పోస్ట్ మరింత బలం చేకూర్చింది అని చెప్పాలి. ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2, భగవంతు కేసరి సినిమాల్లో నటిస్తోంది. ఇక ఇది పూర్తయిన వెంటనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి. అయితే తమ అభిమాన హీరోయిన్ గురించి ఇలాంటి ప్రచారం జరుగుతూ ఉండడంతో ఫాన్స్ మాత్రం ఆందోళనలో మునిగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: