పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాలలో బ్రో సినిమా కూడా ఒకటి. వచ్చే నెల 28వ తారీఖున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి టీజర్, ట్రైలర్ ను మాత్రం విడుదల చేయలేదు చిత్ర బృందం.. కేవలం మోషన్ పోస్టర్లు తప్ప మరేవి కూడా అప్డేట్ చేయలేదు.ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కోసం అభిమానులైతే చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరో వారం రోజులు గడిస్తే ఈ సినిమా విడుదల అయ్యేందుకు కేవలం నెలరోజుల సమయం మాత్రమే ఉన్నది.

దీంతో అభిమానులలో ఒక్కసారిగా టెన్షన్ మొదలైనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు కనీసం రెండు నెలల ముందే టీజర్ గాని.. గ్లింప్స్ కానీ విడుదల చేయవలసి ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలా జరగలేదు.. దీంతో కొంతమంది అభిమానులు బ్రో అనే సినిమా ఉందని విషయాన్ని కూడా మర్చిపోవడం జరుగు తోందట. కేవలం ఉస్తాద్ భగత్ సింగ్  సినిమాకి బాగా పేరు వస్తోంది ఆ తర్వాత హరిహర వీరమల్లు సినిమాకి కూడా బాగానే పేరు వినిపిస్తోంది కానీ బ్రో సినిమాకు పెద్దగా బజ్ లేకపోవడం జరుగుతోంది.


ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని మరో పది రోజుల తర్వాత విడుదల చేయబోతున్నట్లు సమాచారం.టీజర్ కట్ అయి సిద్ధంగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో పాల్గొనడం వల్ల ఆలస్యం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వారాహి యాత్ర పూర్తి అయ్యేవరకు ఈ టీజర్ ని విడుదల చేయకూడదని మేకర్స్ భావించినట్లు సమాచారం. ఈనెల 24వ తేదీన వారాహి యాత్ర పూర్తి కాబోతోంది.. బ్రో టీజర్ ఈనెల ఆఖరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: