టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు లెలిగిన అనుష్క గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపుగా 10 సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగింది ఈమె. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ కనిపిస్తుంది. అయితే అనుష్కకి ఇంత వయసు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. దీంతో ఆమెపై పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇక మొదట ఆమె సూపర్ సినిమాతో తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ పూరీ జగన్నాద్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది ఈమె. ఇక అప్పటినుండి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

ఈ క్రమంలోనే అప్పుడప్పుడు వారిద్దరికీ సంబంధించిన పలు రకాల రూమర్స సైతం వినిపిస్తూ ఉంటాయి. అయితే అనుష్క నాగార్జున ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో జంటగా నటించారు. నాగార్జున కుమారులు సైతం అనుష్క మా కుటుంబానికి మంచి స్నేహితురాలు అని చెప్తూ ఉంటారు. అయితే అనుష్క అసలు పేరు స్వీటీ. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెని అదే పేరుతో పిలుస్తారు .అదే పేరుతో తనకి నామకరణం సైతం చేశారు. ఇక సూపర్ సినిమా షూటింగ్ సమయంలో అనుష్కని నాగార్జున అని పేరేంటి అని అడిగితే స్వీటీ అని చెప్పింది అంట అనుష్క .ఇక నాగార్జున ఆమె పాస్పోర్ట్ కూడా చూశారట.

అందులో కూడా ఆమె పేరు స్వీటీ అని ఉండడంతో ఒక హీరోయిన్ కి ఇలాంటి పేరు సెట్ అవదు అని ఒక మంచి పేరును పెట్టాలని పూరి జగన్నాథ్ తో డిస్పర్షన్ చేశారట నాగార్జున. ఇక అదే సమయంలో ఒక సింగర్ పేరు ని అనుష్కకి అనుష్క అనే పేరుని పెట్టారట. ఇక అప్పటినుండి సినీ ఇండస్ట్రీలో ఆమెని అందరూ అనుష్క అని అంటున్నారు. అయితే అప్పటివరకు సినీ ఇండస్ట్రీలో అనుష్క అనే పేరుతో ఎవరు వచ్చింది లేదు. దీంతో స్వీటీ పేరు కాస్త అనుష్కగా మారి స్టార్ హీరోయిన్ అయింది. ఇక అప్పటినుండి నాగార్జున అనుష్కల మధ్య మంచి బంధం ఏర్పడిందని అంటున్నారు .అయితే ఈ విషయాన్ని ఒక ఈవెంట్ సందర్భంగా పూరి జగన్నాథ్ స్వయంగా తెలియజేయడం జరిగింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: