ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న మహేష్ త్రివిక్రమ్ ల ‘గుంటూరు కారం’ మూవీ షూటింగ్ కూడ రకరకాల కారణాలతో ఆలస్యంగా నడుస్తోంది. ఈఆలశ్యంతో మహేష్ కొంతవరకు అసహనంలో ఉన్నాడు అంటూ గాసిప్పులు కూడ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో బన్నీ త్రివిక్రమ్ లతో ఒక సినిమా త్వరలో ప్రారంభం అవుతుంది అంటూ హారిక హాసినీ ఇచ్చిన ప్రకటన వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశక్తికర చర్చలు చేస్తున్నాయి.
వాస్తవానికి అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈమూవీ ఈ సంవత్సరం విడుదల అవుతుంది అని అంటున్నప్పటికీ సుకుమార్ వ్యవహార శైలిని బట్టి ఈమూవీ వచ్చే సంవత్సరం సమ్మర్ కు మాత్రమే అని అంటున్నారు. త్రివిక్రమ్ మహేష్ ల మూవీ వచ్చే సంక్రాంతికి మాత్రమే విడుదల అవుతుంది. దీనితో త్రివిక్రమ్ మరో సినిమాను మొదలుపెట్టాలంటే కనీసం 6 నెలలు పైగా ఆగాలి. ఇలాంటి పరిస్థితులలో ఇంత హడావిడిగా ఈ ప్రకటన ఏమిటి అంటూ మరరికొందరు షాక్ అవుతున్నారు.
‘పుష్ప 2’ తరువాత బన్నీ ఏదర్శకుడుతో చేయాలి అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. మహేష్ తో మూవీ తరువాత త్రివిక్రమ్ ఏటాప్ హీరోతో సినిమా చేయాలి అన్న ఆలోచనాలలో ఉన్నాడు. దీనితో వీరిద్దరి కన్ఫ్యూజన్ తీర్చి ఏదోవిధంగా వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ సెట్ చేయాలి అన్న ప్రయత్నంలో భాగమే ఈప్రకటన అంటున్నారు. వాస్తవానికి ‘పుష్ప 2’ తరువాత అల్లు అర్జున్ ఒక భారీ పాన్ ఇండియా మూవీని చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు ఇంకా ముందుకు నడవకపోవడంతో బన్నీ త్రివిక్రమ్ వైపు అడుగులు వేసి ఉంటాడు అన్న అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి