గత కొంతకాలంగా వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న నాగార్జున కెరియర్ ప్రస్తుతం పూర్తి కన్ఫ్యూజన్ లో ఉంది. అతడి కెరియర్ లో ఇలాంటి డల్ పీరియడ్ ఎప్పుడు చూసి ఉండడు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. లేటెస్ట్ గా నాగార్జున బెజవాడ ప్రసన్న దర్శకత్వంలో నటించవలసిన సినిమా క్యాన్సిల్ అవ్వడంతో నాగార్జున తన భవిష్యత్ సినిమాల కథల ఎంపిక పై ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నాడో అర్థం అవుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.పరిస్థితులు ఇలా ఉండగా నాగార్జునకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుండి ఒక భారీ ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 10 ఎపిసోడ్స్ తో తాము నిర్మించబోయే వెబ్ సిరీస్ బాధ్యతలను అన్నపూర్ణ స్టూడియోస్ కు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. ఈవిషయమై నెట్ ఫ్లిక్స్నాగార్జునకు భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ప్రస్థుతం నాగ్ కొంతమంది యంగ్ రైటర్స్ టీమ్ ను ఎంపికచేసి వారిచేత వెబ్ సిరీస్ కు పనికి వచ్చే విధంగా ఒక కథను తయారు చేయించే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత తరం ఓటీటీ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఒక పవర్ ఫుల్ కథను వెబ్ సిరీస్ గా మారుస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ లో నాగార్జునతో పాటు అఖిల్ కూడ ఒక కీలక పాత్రలో నటించే విధంగా కథను డిజైన్ చేస్తున్నారని టాక్.ఓటీటీలో ప్రసారం అయ్యే వెబ్ సిరీస్ లు అంటే బూతు కంటెంట్ విపరీతంగా ఉంటోంది. ఆమధ్యన ఓటీటీలో స్ట్రీమ్ అయిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ను చూసి అందులో ఉన్న బూతు సీన్స్ డైలాగ్స్ విని చాలామంది తట్టుకోలేకపోయారు. వెంకటేష్ లాంటి మంచి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న హీరో అలాంటి బూతు వెబ్ సిరీస్ లో నటించడం ఏమిటి అంటూ విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితుల మధ్య అలాంటి పరిస్థితులు రాకుండా నాగార్జున ఎలా తెలివిగా వ్యవహరిస్తాడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: