సాధారణంగా సెలబ్రిటీలు కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. ఆ టాపిక్స్ గురించి ప్రశ్నలు అడిగినా సెలబ్రిటీ లను ప్రశ్నలు అడిగే విధానం ఇదేనా అని కామెంట్లు వ్యక్తమవుతాయి.అయితే లస్ట్ స్టోరీస్2 ఈ నెల 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా కాజోల్ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. మీ దృష్టిలో లస్ట్ అంటే ఏంటి అని ఒక విలేకరి కాజోల్ ను అడగగా ఆమె తనదైన శైలి లో సమాధానం ఇచ్చారు. నా దృష్టిలో లస్ట్ అంటే విపరీతమైన కోరిక అని ఆమె అన్నారు. అది మనకు ఉండే శరీర వాంఛల్లో మాత్రమే కాదని ఏ విషయం లో అయినా కావచ్చని ఆమె కామెంట్లు చేశారు. నా వరకు అయితే నా లైఫే నాకు ఒక పెద్ద లస్ట్ అని కాజోల్ పేర్కొన్నారు. నచ్చిన ఆహారం తినడం, డ్యాన్స్ చేయడం, మ్యూజిక్ ఆస్వాదించడం కూడా నా దృష్టిలో లస్ట్ అని ఆమె అన్నారు.

పిల్లలతో గడిపిన ప్రతి నిమిషాన్ని ఆస్వాదించడం కూడా నా దృష్టిలో లస్ట్ కిందికి వస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రముఖ నటీమణులు నటించిన లస్ట్ స్టోరీస్2 ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. లస్ట్ స్టోరీస్1 ను మించి లస్ట్ స్టోరీస్2 ఈ ఉండనుందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ షూట్ సమయంలోనే తమన్నా విజయ్ వర్మ ప్రేమలో పడ్డారని సమాచారం అందుతోంది. లస్ట్ స్టోరీస్2 వెబ్ సిరీస్ తో నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్లు సైతం భారీ రేంజ్ లో పెరిగే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నారు. బోల్డ్ వెబ్ సిరీస్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కమర్షియల్ రిజల్ట్ గురించి తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: