టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోలుగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్ ను చాలా రోజుల క్రితమే ప్రారంభించిన విషయం మనకు తెలిసింది.

మూవీ పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. పవన్ కెరియర్ లో ఇదే మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టి చాలా రోజులే అవుతున్న ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాలేదు. అలాగే కొన్ని రోజుల క్రితం వరకు ఈ మూవీ కి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ను ఈ మూవీ మేకర్స్ విడుదల చేస్తూ వచ్చారు. కాకపోతే గత కొన్ని రోజులుగా మాత్రం ఈ మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను ఈ చిత్ర బృందం బయటికి విడుదల చేయలేదు. ఇకపోతే ఈ మూవీ లో నిది అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ...  ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన 80 రోజుల షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం చరణ్ కు సంబంధించిన ఒక పోస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఆ తర్వాత ఈ మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను కూడా ఈ మూవీ బృందం విడుదల చేయలేదు. ఇలా భారీ క్రేజ్ ఉన్న ఈ రెండు పాన్ ఇండియా మూవీ లకు సంబంధించిన అప్డేట్లు రాకపోవడంతో మెగా అభిమానులు ఈ రెండు మూవీ మేకర్స్ పై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: