తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ ఆఖరుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన వారిసు అనే తమిళ సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ తెలుగులో వారసుడు పేరుతో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు లియో అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

త్రిష ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి "నా రెడీ" అంటూ సాగే మొదటి పాటను విడుదల చేసింది. ఈ పాటకు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ పాట విడుదల అయిన 5 రోజుల్లోనే 33 మిలియన్ వ్యూస్ ను ... 1.9 మిలియన్ లైక్స్ ను సాధించి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా అదిరిపోయే రేంజ్ బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇది వరకు విజయ్ ... లోకేష్ కాంబినేషన్ లో మాస్టర్ మూవీ రూపొంది మంచి విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: