మోస్ట్ టాలెంటెడ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటువంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి ప్రస్తుతం వరుస తెలుగు ... తమిళ సినిమాల్లో నటిస్తూ ఈ రెండు ఇండస్ట్రీ లలో కూడా ఫుల్ క్రేజీ నటిగా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. తాజాగా కీర్తి తెలుగు లో నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన దసరా అనే పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. 

ఇకపోతే ఈనటి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈనటి తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఇలా ప్రస్తుతం తెలుగు ... తమిళ ఇండస్ట్రీ లలో ఫుల్ క్రేజీ నటిగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలను చాలా ఎక్కువగా పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కీర్తి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే స్టైలిష్ అండ్ ట్రెండీ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అంతే స్టైలిష్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలను ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో తాజాగా పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: