హీరో హీరోయిన్ల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడంలో జనాలు బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎక్కువగా వారి ప్రేమ, డేటింగ్ వ్యవహారాల గురించి తెలుసుకోవడానికి బాగా ప్రయత్నిస్తూ ఉంటారు.అందుకే వారి గురించి ఏదైనా వార్త వచ్చిన.. లేదా వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్న బాగా అన్ని పనులు పక్కకు పెట్టి మరి వింటూ ఉంటారు. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఇంటర్వ్యూలలో వాళ్ళు కొన్ని విషయాలు బయట పెడుతూ ఉంటారు కాబట్టి. అయితే తాజాగా మృనాల్ ఠాకూర్ కి సంబంధించిన ఒక విషయం బాగా వైరల్ అవుతుంది. ఇంతకు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్, బాలీవుడ్ నటి మృనాల్ ఠాకుర్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. తొలిసారిగా 2012లో ముజేసే కుచ్ కెహతి ఏ ఖామోషియన్ అనే సీరియల్ తో సీరియల్ నటిగా పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంటుంది. ఇక 2014లో విట్టి దండు అని సినిమా ద్వారా మరాఠీ వెండితెరపై అడుగు పెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ వెండితెరపై, టాలీవుడ్ వెండితెరపై అడుగుపెట్టింది.

ఇక తెలుగులో సీతారామం  సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలిసారి నటనతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది. అంతేకాకుండా తన నాచురల్ అందంతో ఎంతోమందిని తనవైపు మలుపుకుంది. ఇక ఏడాదికి వరుసగా రెండు మూడు సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది. అలా తక్కువ సమయంలో బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోవటంతో దీంతో సీతారామం డైరెక్టర్ ఈ ముద్దుగుమ్మను చూసి ఫిదా అయ్యి తన సినిమాలో తనని హీరోయిన్ గా పెట్టుకున్నాడు. దీంతో ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడటంతో మంచి అభిమానం సొంతం చేసుకుందిసోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది. అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలను కూడా బయటపడుతుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా లవ్ స్టోరీస్ 2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తను ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పంచుకుంది. తను పదో తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి తనని ప్రపోజ్ చేశాడు అని.. ఏమాత్రం ఆలోచించకుండా తను ఓకే చేశాను అని తెలిపింది. అలా కొంతకాలం వారిద్దరూ లవ్ లో ఎంజాయ్ చేయగా.. తను పై చదువుల కోసం ముంబై వచ్చినప్పుడు అతడిని మర్చిపోయిందట. ఇప్పుడు అతడు ఏం చేస్తున్నాడో కూడా తెలియదని అనటంతో ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో పదో తరగతిలోనే ఈ హాట్ బ్యూటీ ప్రేమాయణం చేసిందనటంతో పాపకు మామూలు తొందర లేదు కదా అని అంటున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. ఇక ఈ బ్యూటీ రీసెంట్ గా విజయ్ దేవరకొండ తో ఒక సినిమాకు ఓకే చేసిన సంగతి తెలిసిందే .

మరింత సమాచారం తెలుసుకోండి: