మెగా స్టార్ చిరంజీవికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉండటంతో ఆయనకు సంబంధించిన ఏ న్యూస్ అయినా క్షణాలలో వైరల్ గా మారిపోతుంది. ఇప్పుడు అలాంటి సందర్భమే మరొకసారి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిరంజీవి తాను తాత అయిన ఆనందాన్ని పక్కకు పెట్టి తన భార్య సురేఖ తో కలిసి అతి త్వరలో అమెరికా వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం చిరంజీవి త్వరలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తాను నటించబోయే ఒక సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్ కు చేయించుకోవడానికి అమెరికా వెళుతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి లాంటి టాప్ హీరో లుక్ టెస్ట్ చేయించుకోవడం ఏమిటి అంటూ కొందరు షాక్ అవుతున్నారు.




తెలుస్తున్న సమాచారం మేరకు కళ్యాణ కృష్ణ చిరంజీవితో మళయాళం లో హిట్ అయిన ‘బ్రో డాడీ’ మూవీ కథకు మార్పులు చేసి చిరంజీవిని డిఫరెంట్ లుక్ లో చూపించడానికి కళ్యాణ్ కృష్ణ ప్రయత్నిస్తున్నాడని అందుకోసమే చిరంజీవిఅమెరికా ప్రయాణం పెట్టాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను చిరంజీవి సన్నిహిత వర్గాలు ఖండిస్తున్నాయి.


చిరంజీవి లాంటి టాప్ హీరో తన లుక్ ను మార్చుకోవడానికి అమెరికా వెళ్ళవలసిన పనిలేదని అవసరం అనుకుంటే చిరంజీవి దగ్గరకు పేరు మోసిన స్టైలిస్టులు వచ్చి సలహాలు ఇస్తారు కాబట్టి ఈ వార్తలు తప్పు అంటూ చిరంజీవి తన వ్యక్తిగత పనుల నిమిత్తం తన భార్యతో కలిసి అమెరికా వెళుతున్నాడు అంటూ చిరంజీవి అమెరికా పర్యటన పై రకారకాల ఊహాగానాలు సోషల్ మెడియాలో వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘భోళాశంకర్’ ఆగష్టులో విడుదల అవుతున్న పరిస్థితులలో ఈ మూవీ ప్రమోషన్ ను ఈ నెలాఖరు నుండి మొదలుపెట్టి మరొక బ్లాక్ బష్టర్ కు గట్టి ప్రయత్నాలు చేయాలని ఇప్పటికే మెగా స్టార్ ఒక స్థిర నిర్ణయం తీసుకున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: