ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే ఎప్పుడు ఏ సినిమా సక్సెస్ అవుతుందో ఎవరమో చెప్పలేము. ఈ మధ్యకాలంలో అలా అంచనాలు లేకుండా థియేటర్ లోకి వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో సామజవరగమన చిత్రం కూడా ఒకటి. ఈ సినిమా లో హీరోగా శ్రీ విష్ణు నటించారు. ఈ సినిమా విడుదలై ఇప్పటికి రెండు వారాలు కావస్తున్న విజయవంతంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.


స్టార్ హీరోల చిత్రమైన యంగ్ హీరోల చిత్రమైన కొత్త హీరోల చిత్రమైన సరే కామెడీ జోనర్లో సినిమా హిట్ అయిందంటే ఇక ఆ సినిమాకి కలెక్షన్లు భారీగానే వస్తూ ఉంటాయి.. కేవలం రూ.7కోట్ల రూపాయలతో తీసిన సామజవరగమన సినిమా.. పెద్దగా పబ్లిసిటీ లేకుండానే థియేటర్లో విడుదలై తొలి రెండు రోజులలోనే అంతంతమాత్రంగా ఉన్న ఈ సినిమా ఒక్కసారిగా శనివారం నుంచి మరింత క్రేజ్ సంపాదించుకొని దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా మూడింతల లాభంతో కలెక్షన్ సాధించినట్లు తెలుస్తోంది.


అయితే తాజాగా థియేటర్లో సక్సెస్ఫుల్గా సాగుతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈనెల 22 లేదా 25 నుంచి ఈ సినిమా ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఆల్రెడీ ఈ సినిమాని థియేటర్లో చూసినవారు కూడా మళ్లీ ఓటీటి లో చూసేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో శ్రీ విష్ణు మళ్లీ కం బ్యాక్ ఇచ్చారని కూడా చెప్పవచ్చు. అఫీషియల్ గా సామజ వరగమన సినిమా  ఓటిటి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తుందేమో చిత్ర బృందం చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: