ముఖ్యంగా రంగస్థలంలో రంగమ్మత్త అనే పాత్రలో నటించింది. ఇక ఈ పాత్ర అనసూయ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది అని చెప్పాలి. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో ఏకంగా నెగిటివ్ షేడ్స్ ఉండే దాక్షాయిని పాత్రలో నటించింది. ఈ పాత్ర కూడా బాగా క్లిక్ కావడంతో అనసూయకు మరింత గుర్తింపు వచ్చింది. ఇక మొన్నటికి మొన్న విమానం సినిమాలో వేశ్యపాత్రలో నటించి ఆకట్టుకుంది అనసూయ. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాలో అనసూయ రోల్ మరింత పవర్ ఫుల్ గా ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. ఇదిలా ఉంటే గతంలో అనసూయ అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి.
ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అల్లు అర్జున్ హీరో ఏంటి? మెగా ఫ్యామిలీ అయితే హీరో అయిపోతారా అని గంగోత్రి సినిమా చూశాక అల్లు అర్జున్ గురించి అనుకున్నాను. లంగా వోణీలో అల్లు అర్జున్ చూసినప్పుడైతే అబ్బో చిరాకుగా అనిపించింది అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో చూసిన తర్వాత అల్లు అర్జున్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు అంటూ చెప్పింది అనసూయ. ఏది ఏమైనా గతంలో అల్లు అర్జున్ గురించి అనసూయ చేసిన కామెంట్స్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు నేటిజన్స్ అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి