అయితే ఆయనకు రష్మిక మందాన హ్యాండ్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. నితిన్ ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకున్నారట. అందుకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడమే కారణం అంటున్నారట. నితిన్ మూవీలో రష్మిక నటించడం కష్టమే అంటూ టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రష్మిక మూడు చిత్రాలు చేస్తున్నారు. పుష్ప 2, యానిమల్ చిత్రాలతో పాటు రైన్ బో టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఆమె నటిస్తున్నారు.
రష్మిక ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న పక్షంలో ఆమె స్థానంలో హీరోయిన్ శ్రీలీలను తీసుకోవాలని అనుకుంటున్నారు. శ్రీలీల ఆల్రెడీ 7 తెలుగు చిత్రాలకు సైన్ చేసింది. భగవంత్ కేసరి, ఆదికేశవ, స్కంద చిత్రాల షూటింగ్ చివరి దశలో ఉంది. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ యాభై శాతం షూటింగ్ జరుపుకున్నాయి. ఈ క్రమంలో నితిన్ మూవీకి శ్రీలీల సైన్ చేస్తుందో లేదో చూడాలి.రష్మిక, నితిన్ కాంబోలో తెరకెక్కిన భీష్మ మంచి విజయం సాధించింది. ఇక రష్మికను టాలీవుడ్ కి పరిచయం చేసింది వెంకీ కుడుములనే. ఛలో మూవీతో మొదలైన రష్మిక ప్రస్థానం సక్సెస్ఫుల్ గా సాగుతుంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అవతరించింది. బాలీవుడ్ ని కూడా షేక్ చేస్తుంది. మరోవైపు నితిన్ రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి