‘విరూపాక్ష’ సూపర్ సక్సస్ తో సూపర్ ట్రాక్ లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఈనెల చివరి వారంలో విడుదల కాబోతున్న ‘బ్రో’ మూవీతో తన కెరియర్ మరింత సెటిల్ అవుతుందని ఆశతో ఉన్నాడు. దీనికి తగ్గట్టుగానే ఈసినిమా పై భారీ అంచనాలు ఉండటంతో ఈమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడం ఖాయం అన్నమాటలు వినిపిస్తున్నాయి.
లేటెస్ట్ గా ఈమూవీకి సంబంధించిన ఒక పాటలో తేజ్ లుక్ చూసి అతడి అభిమానులు కొంతవరకు కలవర పడుతున్నారు. దీనికి కారణం తేజ్ మళ్ళీ లావుగా కనిపిస్తున్నాడు. గతంలో చిరంజీవి కూడ ఈ లావు సమస్యలతో పోరాటం చేసి తన బాడీని కంట్రోల్ చేసుకున్నాడు. దీనితో తేజ్ కు అతడి మేనమామ పోలికలు వచ్చాయా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
గంటల తరబడి ఫిజికల్ ఫిట్నెస్ కోసం వ్యాయామం చేసే అలవాటు మెగా హీరోలు అందరికీ ఉంది. ఈవిషయంలో ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే మినహాయింపు అనుకోవాలి. పవన్ కళ్యాణ్ పెద్దగా గంటల తరబడి జిమ్ లో కాలం గడపకపోయినా పెద్దగా అతడు బాడీ పెరగదు. ఇప్పుడు తేజ్ ‘బ్రో’ మూవీలో లావుగా కనిపిస్తూ ఉండటంతో అతడి ఫిట్నెస్ గురించి శ్రద్ద పెట్టమని అతడి అభిమానులు సలహా ఇస్తున్నారు.
రెండు సంవత్సరాల క్రితం తేజ్ కు జరిగిన యాక్సిడెంట్ తరువాత ఈ మెగా మేనల్లుడు జిమ్ లో కాలం గడిపే విషయంలో కొంత తక్కువ శ్రద్ద కనపరుస్తున్నాడని కొన్ని వార్తలు ఉన్నాయి. ఈకారణం వల్ల ‘బ్రో’ మూవీలో అతడు లావుగా కనిపిస్తున్నాడు అన్న సందేహాలు అతడి అభిమానులకు వస్తున్నాయి. ‘విరూపాక్ష’ మూవీ కంటే కూడ తేజ్ ‘బ్రో’ మూవీలో లావుగా కనిపిస్తూ ఉండటంతో అతడి ఫిట్నెస్ గురించి శ్రద్ద పెట్టమని అతడి అభిమానులు సూచనలు చేస్తున్నారు. హీరోల అభిమానులు తమ హీరోల గురించి వారి ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ద చూపుతారు అన్న విషయం మరొకసారి ఋజువవుతోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి