కాగా తాజాగా వీరిద్దరి పిల్లలకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటికి వచ్చింది. మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే చాలా పాపులర్ అయ్యింది. అద్భుతంగా డ్యాన్స్‌లు, యాక్టింగ్ చేస్తూ తన నట వారసత్వాన్ని తాను ముందుకు తీసుకెళ్లగలనని ఈ చిన్నారి సోషల్ మీడియా వీడియోల ద్వారా చెప్పకనే చెబుతోంది. మహేష్, నమ్రత కూడా సితారకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ చిన్నారిని సినిమాల్లో చూడాలని అభిమానులు కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ కూడా సోషల్ మీడియాలో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అభయ్‌కి 8 ఏళ్ల దాకా వయసు ఉంటుంది. అయితే ఈ బుడ్డోడు కూడా సినిమాల్లో కనిపిస్తే చూడాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అటు మహేష్, ఇటు తారక్ అభిమానులకు ఒకేసారి అదిరిపోయే న్యూస్ అందింది. అదేంటంటే రాజమౌళి, మహేష్ బాబు కాంబో మూవీలో ఇంట్రడక్షన్ సీన్ 20 నిమిషాలు ఉంటుందట. ఈ 20 నిమిషాల సమయంలో సితార, అభయ్ రామ్‌లను చూపించాలని రాజమౌళి యోచిస్తున్నాడట.
సినిమా కథలో భాగంగా ఇద్దరు పిల్లలు అవసరం అయ్యారని, దాంతో రాజమౌళి సెలబ్రిటీ పిల్లలను ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ సినిమా మహేష్ దే కాబట్టి జక్కన్న మహేష్ కూతురు సితారని మొదటిగా ఎంపిక చేసుకున్నాడట. ఇక జూనియర్ ఎన్టీఆర్‌తో రాజమౌళికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకే తారక్ కుమారుడు అభయ్ ని సెలెక్ట్ చేసుకున్నాడట. రాజమౌళితో పాటు మహేష్ తో మంచి అనుబంధ ఉంది కాబట్టి తారక్ కూడా తన కొడుకుని ఈ సినిమాలో నటింపజేయడానికి అంగీకరించాడట.
ఇక మొదటి 20 నిమిషాల ఇంట్రో మహేష్ రాజమౌళి సినిమా మొత్తానికే హైలెట్ కానుందట. ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా తారక్-మహేష్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి