పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి తేజ్ కాంబినేషన్లో వస్తున్న బ్రో సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి వస్తున్న అప్డేట్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా సెన్సార్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. అయితే ఈ సినిమాకి యు సర్టిఫికెట్ రాగా పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లాగే సినిమా ఉండపోతుందని అంటున్నారు. ఇకపోతే తెలుగు ప్రేక్షకులను కచ్చితంగా ఈ సినిమా మెప్పించేలా త్రివిక్రమ్ శ్రీనివాస్సినిమా స్క్రిప్ట్ లోకి మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక  పవన్ కళ్యాణ్ మేనరిజం సినిమాలో ఉంటాయని..

పవన్ ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ సన్నివేశాలు సినిమాలో కొదవ ఉండదని అంటున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఖాతాలో ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ చేరడం ఖాయమని ఇందులో ఎటువంటి సందేహం లేదు అన్న కామెంట్స్ సైతం వినపడుతున్నాయి. అయితే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తుందని ఇప్పటికే ఫిక్స్ అయ్యారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇదిలా ఉంటే మరోవైపు ఈ సినిమా నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ బ్రో సినిమాపై రాజకీయ అంశాల ప్రభావం చూపవని భావిస్తున్నానంటూ చెప్పవచ్చాడు. లిమిటెడ్ బడ్జెట్లో సినిమా పూర్తయిందని టికెట్ రేట్లను పెంచాలని ఆలోచన చేయడం లేదని ఆయన చెప్పడం జరిగింది.

అంతేకాదు పెద్ద సినిమాలకు ప్రీమియర్స్ అక్కర్లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఫాన్స్ నుండి ఒత్తిడి వస్తే పరిస్థితిల ఆధారంగా ప్రీమియర్స్ విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమ బ్యానర్ లో ఈ సినిమా 25వ సినిమా అని బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయాలని ఉంది అంటూ విశ్వప్రసాద్ చెప్పడం జరిగింది. నైజాం లో మైత్రి నిర్మాతలు ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక ఈనెల 28 విడుదలవుతున్న ఈ సినిమా కమర్షియల్ గా ఏలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూద్దాం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: