ఈ చిత్రం మీద ప్రజల అభిప్రాయం సోసో గానే ఉన్న నందిత మాత్రం తన నటనతో మళ్ళీ అందరిని ఆకట్టుకుంటోంది. నటన పెద్దగా రాకపోయినా కేవలం గ్లామర్తో సినీ పరిశ్రమలో హీరోయిన్లుగా చలామణి అవుతున్నవారు చాలా మంది ఉన్నారు. కానీ నటన, అందం రెండు పుష్కలంగా ఉన్న నందిత మాత్రం ఇంకా అవకాశాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ ప్రదర్శనతోనైనా ఆమె పెద్ద దర్శకుల కళ్ళలో పడుతుందో లేదో వేచి చూడాల్సిందే.నందిత శ్వేతా బెంగుళూరు లో 1990లో జన్మించారు.ఆమె మొట్ట మొదటిసారిగా 2008 లో "నంద లవ్స్ నందిత"అనే కన్నడ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. 2016 లో ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టారు. పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 8 సంవత్సరాలు కావస్తున్నా ఆమె తెలుగులో కేవలం పది సినిమాలే చేయడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి