సాధారణంగా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద విడుదలవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని ప్రేక్షకులకు నచ్చితే.. మరికొన్ని నిరాశపరిచి ఫ్లాప్ గానే మిగిలిపోతూ ఉంటాయి. ఇంకొన్ని అటు ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తుండిపోతుంటాయి అని చెప్పాలి. ఇలా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరికీ కూడా చిరస్థాయిగా గుర్తుండిపోయే సినిమాలలో ఆయన హీరోగా నటించిన తమ్ముడు సినిమా కూడా ఒకటి. ఇప్పుడు ఈ సినిమా టీవీలలో వచ్చిన కూడా ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోయి మరి ఈ సినిమా చూస్తూ ఉంటారు.



 ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఇక ఈ మూవీ అటు పవన్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా కూడా ఉంది అన్న విషయం తెలిసిందె  అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కిక్ బాక్సింగ్ నేర్చుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాడు. అయితే ఈ స్టోరీ నిజంగా పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ స్టోరీ అన్నది తెలుస్తుంది. చెన్నైలోని కరాటే మాస్టర్ షహాని హుస్సేన్ దగ్గర కరాటే నేర్చుకుంటానని పవన్ కళ్యాణ్ వెళ్తే ఇప్పుడు నేను ఖాళీగా లేను. అలాగే నేను ఈ మధ్యకాలంలో కరాటే నేర్పించడం మానేసాను వెళ్లిపో.  అన్నారట ఆయన.


 కానీ పవన్ కళ్యాణ్ నేను కరాటే నేర్చుకుంటే మీ దగ్గరే నేర్చుకుంటాను అని మొండిపట్టు పట్టి భీష్ముంచుకుని కూర్చున్నారట. ఓ రోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మార్నింగ్ ఐదు నుంచి నైట్ 11 వరకు నా దగ్గరే ఉండు. నేను ఖాళీగా ఉన్న టైంలో అర్థగంట నీకు కరాటే నేర్పిస్తా అంటూ చెప్పారు. పవన్ కళ్యాణ్ నిజంగానే 15 రోజులు పాటు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆయన దగ్గరే ఉన్నారట. ఇక పవన్ డెడికేషన్ చూసి ముచ్చట పడిన ఆయన.. సంవత్సరం పాటు పవన్కు  కోచింగ్ ఇచ్చారు. ఇక ఆయన కోచింగ్ లోనే పవన్ కళ్యాణ్ బ్లాక్ బెల్ట్ కూడా పొందారు. ఇక తమ్ముడు సినిమాలో కూడా సేమ్ స్టోరీ ఇలాగే ఉంటుంది అని చెప్పాలి. ఇలా పవన్ ఇండైరెక్టుగా తన రియల్ లైఫ్ స్టోరీని ఈ మూవీలో చెప్పకనే చెప్పాడు అని కొంతమంది  అభిమానులు భావిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: