
ఈనెల 27వ తేదీన ఈ సినిమా ట్రైలర్ను లాంచ్ చేయబోతున్నట్లు డైరెక్టర్ మెహర్ రమేష్ తెలియజేశారు.. జులై 27న భోళా శంకర్ సినిమా ట్రైలర్ వస్తూ ఉండగా ఆ మరుసటి రోజున పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ నటించిన బ్రో సినిమా విడుదల కాబోతోంది. దీంతో మెగా అభిమానులకు ఇది కిక్కించే డబల్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈనెల చివరిలో ఫుల్ గా ఎంజాయ్ చేయాలని ఇప్పటికి పలువురు అభిమానులు సైతం సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తోంది అలాగే చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించినది.
ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న వేదాళం సినిమా నుంచి రీమిక్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు అక్కినేని హీరో సుశాంత్ కూడా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తూ ఉన్నారు. మరి భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి మరి. ముఖ్యంగా భోళా శంకర్ ట్రైలర్ సక్సెస్ అయ్యిందంటే ఇక సినిమా కూడా సక్సెస్ అయినట్టే అని అభిమానులు భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి